TRS MLC : ప్రగతిభవన్‌కు గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి..?

TRS MLC : సీఎం కేసీఆర్ ప్రకటించబోయే ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎవరి పేర్లనూ అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కొందరికి ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, కడియం శ్రీహరితో పాటు నిన్ననే సిద్దిపేట కలెక్టర్‌గా రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి సైతం ప్రగతి భవన్‌కు బయల్దేరారు. మొత్తం ఆరుగురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉండగా.. ఇప్పటి వరకు ఐదుగురు ఆశావహులు ప్రగతి భవన్ చేరుకున్నారు. మరో పేరు ఎవరిదై ఉండొచ్చన్న ఉత్కంఠ మాత్రం అలాగే కొనసాగుతోంది.
ఎమ్మెల్సీ రేసులో అనూహ్యంగా దూసుకొచ్చారు వెంకట్రామిరెడ్డి. సిద్దిపేట కలెక్టర్‌గా నిన్ననే వీఆర్‌ఎస్ తీసుకున్న వెంకట్రామిరెడ్డి.. టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరు నామినేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే, ఆ ఫైల్ ఇంకా పెండింగ్‌లోనే పెట్టడంతో.. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలోగానీ, స్థానిక సంస్థల కోటాలో గానీ అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. అందుకే, పాడి కౌశిక్ రెడ్డికి కూడా ప్రగతి భవన్ నుంచి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com