TS: తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు ప్రధాని మోదీ జవాబు

TS: తెలంగాణ విద్యార్థిని ప్రశ్నకు ప్రధాని మోదీ జవాబు
భాష నేర్చుకోవాలంటే కావల్సింది తపన.. ఓ 8 ఏళ్ల చిన్నారిని ఉదహరించిన ప్రధాని మోదీ


తెలంగాణ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాదానం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలో అన్న విషయంపై ప్రధాని విద్యార్థులతో 'పరీక్షా పే చర్చ - 2023' అనే కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ స్కూల్ కు చెందిన అక్షర అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ప్రధాని బదులిచ్చారు. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషిని చేయాలన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఓ 8ఏళ్ల చిన్నారిని ఉదహరించారు.

కార్మికులు నివసించే ఓ బస్తీలో 8ఏళ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాల్ ,తమిళ్ మాట్లాడుతుందని అన్నారు మోదీ. ఆ చిన్నారికి అన్ని భాషలు ఎలా వచ్చాయోనని ఆరాతీశానని చెప్పారు. చిన్నారి ఇంటి పక్కన ఓక్కో రాష్ట్రానికి చెందిన వారు ఉండేవారని.. వారితో కలిసి ఆడుకుంటూ భాషలు నేర్చుకుందని చెప్పారు. భాష నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదని తపన ఉంటే చాలని మోదీ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story