TS: తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారింది : కేటీఆర్

శాసన సభలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయన్నారు. నా బార్డు, ఎఫ్‌సీఐ నివేదికలను కూడా నమ్మరా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా మారిందన్నారు. సద్విమర్శలు చేయండి కానీ రాష్ట్రాన్ని కించపరచకండి అంటూ మండిపడ్డారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాతో పోటీపడుతున్నామన్నారని అన్నారు.
గుజరాత్లో పరిశ్రలకు పవర్ హాలీడేలు ప్రకటిస్తున్నారు అన్నారు. మేము రైతురాజ్యం కావాలంటే.. బీజేపీవాళ్లు కార్పోరేట్ రాజ్యం కావాలని అంటున్నారని మండిపడ్డారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తాం అన్నారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు మంత్రి. ఇటువైపు ఉన్నప్పుడు బాగున్న ఈటల అటు వెళ్లాక పూర్తిగా మారిపోయారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలో ఎక్కడా లేరంటూ మండిపడ్డారు. దేశప్రజల చూపు కేసీఆర్ వైపు ఉందన్నారు. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు ఆర్థికవేత్త లేరు అన్నారు మంత్రి. రోజుకు మూడు డ్రస్ లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పనిచేయాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com