TS : "తెలంగాణ ఐపీఎస్ అధికారులకు ప్రాధాన్యత లేదు"

X
By - Vijayanand |5 Feb 2023 3:13 PM IST
తెలంగాణ ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో ప్రాధాన్య ఇవ్వడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు.
తెలంగాణ ఐపీఎస్ అధికారులకు రాష్ట్రంలో ప్రాధాన్య ఇవ్వడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు. డీజీపీ, అడిషనల్ డీజీపీ, ఐజీ.. హైదరాబాద్ రేంజ్ పోస్టులను కూడా బిహార్‌కు చెందిన వ్యక్తులకు ఎందుకు కట్టబెడుతున్నారంటూ ప్రశ్నించారు . తాము 'జై తెలంగాణ' నినాదం ఎత్తినప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
ఇటీవల బదిలీ చేసిన 93మంది ఐపీఎస్ ఆఫీసర్లలో ఒక్కరికి కూడా కీలక పోస్టు ఇవ్వలేదని రఘునందన్ రావు అన్నారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యక్తి కాదని అప్పటి ఆంధ్ర పెద్దలు అన్నారని, ఇప్పుడు ఆయన పనులు చూస్తుంటే నాక్కూడా అనుమానం వస్తుందని అన్నారు రఘునందన్ రావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com