TS: తెలంగాణలో కరెంట్‌కు డిమాండ్

దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండు పెరిగింది. కరెంట్ వాడకం పెరగడంతో భారత ఇంధన ఎక్స్ఛేంజిలో కరెంటు ధరలు భగభగ మండుతున్నాయి. ప్రస్తుతం యూనిట్ కరెంటును 12 రూపాయలకు కొనాల్సి రావడంతో డిస్కంలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.ఇప్పటికే కరెంటు కొనుగోలుకు అదనంగా వెయ్యి కోట్లు ఖర్చుపెట్టాయి.డిమాండు పెరగడంతో వచ్చే మార్చినాటికి మరో రెండు వేల కోట్లవరకు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అధికారులు అంటున్నారు.
ఇక తెలంగాణలో యాసంగి పంటల సాగు సీజన్ అక్టోబరు నుంచి మార్చి వరకూ ఉంటుంది. ఈ సీజన్‌లో వరి సాగు భారీగా పెరగడంతో విద్యుత్ డిమాండు, వినియోగం ఎక్కువైంది.18 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగాఇప్పటికే 38 లక్షల ఎకరాలకు పైగా వరి నాట్లు వేశారు. సాగు నీరందించేందుకు రోజూ 27 లక్షలకు పైగా బోర్లను నడుపుతున్నారు. ప్రస్తుతం రోజూ రాష్ట్రంలో వినియోగమవుతున్న 230 మిలియన్ యూనిట్ల కరెంటులో 40 శాతానికి పైగా వ్యవసాయానికి వాడుతున్నట్లు డిస్కంల అంచనా.
మరోవైపు 2022 డిసెంబరు నుంచి 2023 జనవరి 30 వరకూ 47 రోజుల నుంచి రోజుకు 205 నుంచి 237 మిలియన్ యూనిట్లల కరెంటు వినియోగం అయింది.ఇందులో 30 మి.యూ.లకు పైగా ఐఈఎక్స్‌లో యూనిట్‌కు 12 రూపాయలు పెట్టి రోజూ కొనాల్సి రావడం వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. రోజుకు 30 కోట్ల వరకూ కరెంటు కొనుగోలుకు ఐఈఎక్స్‌కు చెల్లిస్తున్నాయి. డిస్కంలు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వ్యవసాయ మోటార్లకు త్రీఫేజ్ కరెంటు సరఫరాపై రోజూ 10 గంటల వరకూ తగ్గిస్తున్నాయి. వ్యవసాయ మోటార్లకు ఆటోమేటిక్ స్టార్టర్లను రైతులు ఏర్పాటు చేసుకోవడంతో కరెంటు వినియోగం భారీగా పెరుగుతోందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com