TS : సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం : మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందన్నారు మంత్రి హరీశ్ రావు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యంఇస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని విమర్శించారు. ఒక్క రూపాయి కూడా కేంద్రం నుండి రాకపోయినా అభివృద్ధి ధ్యేయంగా తెలం గాణ ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ మోడల్ దేశం అవలంభిస్తోందన్నారు. సంక్షేమ పథకాలు ఆగకూడదన్న సీఎం కేసీఆర్ ఆలోచనలతో బడ్జెట్ కేటాయింపులు చేశామన్నారు హరీశ్ రావు.
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మంత్రి హరీశ్ రావు. బడ్జెట్ పత్రాలతో తన నివాసం నుండి బయల్దేరిన హరీశ్ రావు.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనాలు చేశారు. అనంతరం ఆలయం నుండి నేరుగా అసెంబ్లీకి చేరుకున్న హరీష్ రావు.. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బడ్జెట్ పత్రాలను అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com