TS : హైదరాబాద్‌లో ఈవెంట్ జరగడం సంతోషం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో ఈ-మొబిలిటీ ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.. దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ జరగడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణ దేశంలోనే యంగస్ట్ స్టేట్ అని తెలిపారు. ఇక్కడున్న వనరుల కారణంగా ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని, దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ మొబిలిటీ మొబిలిటీ వ్యాలీని ప్రారంభిస్తున్నామని చెప్పారు.
15వేల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా రాబోయే ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ మొబిలిటీ వీక్‌లో వందకుపైగా స్టార్టప్స్ తమ ఆలోచనలు పంచుకోనున్నాయన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com