TS : ఎండాకాలం సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

TS :  ఎండాకాలం సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
X
ఎండలు మండిపోతుండటంతో మార్చి రెండవ వారం నుంచి ఒకే పూట బడులను నడపాలని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది

ఎండాకాలం సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 25నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 25నుంచి జూన్ వరకు అనగా.. 48రోజులపాటు విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ ఇవ్వనున్నారు. విద్యార్థుల సమ్మెటివ్ అసెస్మెంట్ -2 పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో షెడ్యూల్ ప్రకారం జరిగే పరీక్షలు ముందుకు జరిగాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, అందులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 12నుంచి పరీక్షలు ప్రారంభించాలని ప్రభుత్వం జీవో జారీచేసింది.

జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎండలు మండిపోతుండటంతో మార్చి రెండవ వారం నుంచి ఒకే పూట బడులను నడపాలని తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13వరకు జరుగనున్నాయి.

Tags

Next Story