TS : ఒంటరిగా గెలవలేం పొత్తు ఉండవచ్చు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

TS : ఒంటరిగా గెలవలేం పొత్తు ఉండవచ్చు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు

రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకవేళ హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా 60 సీట్లు రావని వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ను పొగుడుతూ బీజేపీని తిడుతున్నారని.. బీఆర్ఎస్, కాంగ్రెస్లు సెక్యులర్ పార్టీలని అన్నారు. తాము ఒంటిరిగా అధికారంలోకి రామని.. సీనియర్ నేతలు అందరూ కలిస్తే 40నుంచి 50 సీట్లు వస్తాయని చెప్పారు. ఆయన గెలిపిస్తాడంటే తామంతా ఇంట్లో కూర్చుంటామని రేవంత్ ను ఉద్ధేశించి వెంకట్ రెడ్డి కామెంట్ చేశారు. మార్చి ఫస్ట్ వీక్లో యాదగిరి గుట్ట నుంచి తన పాదయాత్ర స్టార్ట్ చేస్తానని వివరించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాష్ట్ర ఇంచార్జ్ గా మాణిక్ ఠాక్రే వచ్చాక పార్టీలో అంతా బాగుందని అన్నారు

కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పొగడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయన్నారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ ఎందుకు తమ పార్టీలో చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ ను పొగిడారన్నారు. కాంగ్రెస్‌తో కలవడమే కేసీఆర్‌ ముందున్న ప్రత్యామ్నాయమని అన్నారు. ఎన్నికల ముందు పొత్తులు అవసరం లేదని, పొత్తులు పెట్టుకుంటే బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారుతుందని అన్నారు. బీఆర్‌ఎస్,కాంగ్రెస్‌ లౌకిక పార్టీలు కాబట్టి రాష్ట్రంలోకలుస్తాయని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు

Tags

Read MoreRead Less
Next Story