TS : వన దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్ రావు

మెదక్ జిల్లా ఏడుపాయలలో మహా శివరాత్రి జాతర ప్రారంభమైంది. వనదుర్గకు ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్న హరీష్‌రావు.. తెలంగాణ ఏర్పడ్డాక.. ప్రతి యేటా ఏడుపాయలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత పురోగమిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి.
తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి హరీష్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు కేసీఆర్ ప్రభుత్వంలో డెవలప్ అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు గర్వించే విధంగా కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రజర్షి షా పొల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com