TS : కుక్కల దాడిలో చిన్నారి మృతి, సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌లో వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారించనుంది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఘటనపై పోలీస్ విచారణ కూడా జరుగుతుంది.
ఇక ఇదే అంశంపై కాసేపట్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.కుక్కలు,కోతల బెడద నివారణ పై జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ అధికారులతో మంత్రి సమావేశం కానున్నారు. ఇక జులై 2020 నాటికి లక్షా 99వేల 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం నివేదిక ఇచ్చింది. ఆగస్టు 2020 నుంచి ఫిబ్రవరి 16, 2023 వరకు 2లక్షల ఒక వెయ్యి 9వందల 7 కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు పూర్తయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com