TS : ప్రీతీ ఘటనపై విచారణకు డీఎంఈ ఆదేశం

ప్రీతీ ఘటనపై నలుగురు ప్రొఫెసర్లతో విచారణకు డీఎంఈ ఆదేశించారు. 24గంటల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. అటు తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని ఎంజీఎం సూపరింటెండెంట్ హెచ్చరించారు.
ప్రీతిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వరంగల్‌లో విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. సైఫ్ వేధింపుల వల్లే ఆత్యహత్యాయత్నం చేసిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకుకోలేదని ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టి ఉంటే ప్రీతి సైసైడ్ అటెంప్ట్ చేసిది కాదని అంటున్నారు సైఫ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేఎంసీలో విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. ప్రీతి సీనియర్ సైఫ్ ను అదుపులోకి తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com