TS : కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్, సీఎస్ కు నోటీసులు

TS : కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్, సీఎస్ కు నోటీసులు
బాలుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది

అంబర్‌ పేట కుక్కల దాడి ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం... తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్‌ కలెక్టర్, లీగల్ సెల్ అథారిటీ, అంబర్‌ పేట మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తుంటే.. జీహెచ్‌ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యంతో పసి బాలుడు మృతి చెందాడని మండిపడింది. ఇక బాలుడి కుటుంబానికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి మళ్లీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఇక పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన కోర్టు... తదుపరి విచారణ మార్చి 16కు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story