TS : తెలంగాణలో ‘ఫాక్స్‌కాన్’ పెట్టుబడులు

ఎలక్టాన్రిక్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్‌నకు చెందిన ‘ఫాక్స్‌కాన్’ సంస్థ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ ప్రపంచంలోనే ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్న వాటిలో అగ్రగామి. రాష్ట్రంలో టీ-వర్క్స్ ప్రారంభానికి విచ్చేసిన ‘ఫాక్స్‌కాన్’ ఛైర్మన్ యంగ్ లియూ బృందం సీఎం కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్‌కాన్ కంపెనీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఆ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా లభిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తిరంగ ముఖ చిత్రాన్ని మార్చిన గొప్ప సంస్థ ‘ఫాక్స్‌కాన్’ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. సంస్థ కార్యకలాపాలకు అన్నిరకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని కేసీఆర్ వారికి హామీ ఇచ్చారు. స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి, భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ భారీ పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు దక్కుతాయని సీఎం అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

