TS: ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలోనే పెడతాం: సీఈవో యంగ్ లియూ

ఫాక్స్‌కాన్ కంపెనీని తెలంగాణలోనే పెడతామన్నారు ఆ కంపెనీ సీఈవో యంగ్ లియూ. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కొంగరకలాన్‌లో పార్క్ పెడతామని, వీలైంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. పార్క్ ఏర్పాటుకు సహకారం కావాలన్నారు. హైదరాబాద్ పర్యటనలో తనకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారన్న లియూ సీఎం కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ ఫాక్స్ కాన్ తెలంగాణలో నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధి కొంగర కలాన్-రావిర్యాలలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి సంస్థ ప్రతినిధులు ఇటీవలే కొంగరకలాన్ -రావిర్యాల ప్రాంతాన్ని సందర్శించారు. కొంగరకలాన్‌లో సుమారు 250 ఎకరాలు ఫాక్స్ కాన్ సంస్థకు కేటాయించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అ తర్వాత సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది లియూ బృందం. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్షమందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని తెలంగాణ ప్రభుత వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com