TS : బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ 2, 4 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు షాద్‌నగర్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ భూ బకాసర పార్టీ అని,బీజేపీ కార్పొరేట్ దోపిడీ పార్టీ అని విమర్శించారు. రాష్ట్రంలో పేదల భూములు కబ్జా చేసి ఆ సొమ్మును బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఖర్చు పెడుతుందని, బీజేపీ కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అప్పగిస్తుందని ఆరోపించారు. రెండు పార్టీలు రాష్ట్రాన్ని, దేశాన్ని అప్పుల పాలు చేస్తున్నారని. ఈ దోపిడి ప్రభుత్వాలను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com