TS : మహిళలు అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదు : డీకే అరుణ

TS : మహిళలు అంటే సీఎం కేసీఆర్‌కు గౌరవం లేదు : డీకే అరుణ
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలే జరుగుతున్నాయని, ఆడపిల్లలను హాస్టల్‌కు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారని అన్నారు.

సీఎం కేసీఆర్‌కు మహిళలు అంటే గౌరవం లేదని మండిపడ్డారు బీజేపీ నేత డీకే అరుణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలే జరుగుతున్నాయని విమర్శించారు. ఆడపిల్లలను హాస్టల్‌కు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో ఒత్తిడికి గురై స్టూడెంట్స్‌ ఆత్మహత్యలు చేసుకుంటుంటే చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ప్రీతి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకోదని.. బీఆర్ఎస్‌ నేతలు గుర్తించుకోవాలని హెచ్చరించారు.

Tags

Next Story