TS: ఎల్చీనగర్ లో ఉద్రిక్తత..ప్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు

X
By - Subba Reddy |7 March 2023 1:00 PM IST
ఐదు రోజుల క్రితం ప్లై ఓవర్‌ను పరిశీలించిన కాంగ్రెస్ శ్రేణులు వాహనదారులతో ప్రారంభిస్తామని హెచ్చరిక
హైదరాబాద్ ఎల్చీనగర్ లో ఉద్రిక్తత నెలకొంది. జంక్షన్‌లో ఉన్న ప్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఐదు రోజుల క్రితం ప్లై ఓవర్‌ను పరిశీలించిన కాంగ్రెస్ శ్రేణులు వాహనదారులతో ప్రారంభిస్తామని హెచ్చరించారు. అనుకున్నట్లుగానే భారీగా ఎల్బీనగర్ ప్లై ఓవర్ దగ్గరకు కాంగ్రెస్ కేడర్ చేరుకున్నారు. వీరిని అడ్డుకున్న పోలీసులు నేతలను అరెస్ట్ చేసి బాలాపూర్ పీఎస్‌కు తరలించారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి అభివృద్ధిని అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. కాలనీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలకు కోడ్ అడ్డురాదా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చే ప్లై ఓవర్ ను ఎందుకు ఓపెన్ చేయరుని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com