TS : ఉమెన్స్ డే శుభాకాంక్షలు : జోగులాంబ కలెక్టర్‌

TS : ఉమెన్స్ డే శుభాకాంక్షలు : జోగులాంబ కలెక్టర్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలన్నారు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి. విద్యార్థినులు తాము ఎంచుకున్న రంగంలో లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ప్రస్తుతం చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని.. గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు.

జిల్లాలో అమ్మాయిల అక్షరాస్యత శాతం తక్కువగా ఉందన్నారు ఎస్పీ సృజన. ముఖ్యంగా డొమెస్టిక్‌ వైలెన్స్‌ పోక్సో కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. మహిళలకు సత్వర న్యాయం చేసేందుకు పోలీస్‌ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. విద్యను అభ్యసించడం ద్వారా ఉద్యోగాల సాధనతో మెరుగైన సమాజం ఏర్పడుతుందని అన్నారు.

Next Story