TS: ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధిస్తున్నాడు: మహిళా సర్పంచ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య అనుచరులపై సొంత పార్టీ మహిళా సర్పంచ్ నవ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను వేధిస్తున్నారని, చిన్న పిల్లలను చూసి సొల్లుకారుస్తున్నారని మండిపడ్డారు జానకిపురం సర్పంచ్. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. తనను ఒంటరిగా రావాలని, నీమీద కోరికతోనే టికెట్ ఇచ్చానని అంటున్నాడని వెల్లడించింది. తగిన గుర్తింపు ఇవ్వకపోవడమే కాకుండా స్థానిక నేతలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేసిన పనులకు బిల్లులు రాకుండా చేస్తున్నారని దీంతో వంటిమీది బంగారం కూడా అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోతానని, ఇలాంటి వారి వల్లనే పార్టీ ఆదరణ కోల్పోతోందని ఆరోపించారు సర్పంచ్ నవ్య.
దీనిపై స్పందించిన రాజయ్య ప్రజల్లో ఆదరణ చూడలేకే సొంత పార్టీ నేతలే శిఖండిలా మారి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే తనపై కుట్రలు చేస్తున్నారని, దీనిపై అధినేత కేసీఆర్‌ను కలిసి అన్ని వివరిస్తానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com