TS: నాగమడుగు ఎత్తిపోతలకు కేటీఆర్‌ శంఖుస్థాపన

TS: నాగమడుగు ఎత్తిపోతలకు కేటీఆర్‌ శంఖుస్థాపన
476కోట్ల రూపాయలతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణం

కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన చేశారు. 476కోట్ల రూపాయలతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణం జరగనుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 40వేల ఎకరాలకు నీరు అందిస్తున్నామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అందిస్తున్నామన్నారు. వందలాది చెరువులను బాగు చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యుత్‌, సాగునీరు పుష్కలంగా అందిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. గతంలో కరెంట్‌ వచ్చుడు వార్త అయ్యేది కానీ ఇప్పుడు కరెంట్‌ పోతే వార్త అయితుందని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఎండిపోయిన నిజాంసాగర్‌ ఇప్పుడు కళకళలాడుతోందన్నారు. రాష్ట్రంలోని 2400 తండాలను పంచాయితీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తోందా అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Tags

Next Story