TS : ఎమ్మెల్సీ కవితపై ట్రోల్స్... రంగంలోకి దిగిన సైబర్ క్రైం

TS : ఎమ్మెల్సీ కవితపై ట్రోల్స్... రంగంలోకి దిగిన సైబర్ క్రైం
X

సోషల్ మీడియాలో అసత్య ట్రోల్స్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులపై సోషల్ మీడియాలో అవాస్తవాలతో ట్రోల్స్ చేస్తున్న 20 మందిపై కేసులు నమోదు చేసారు. మహిళలను కించపరిచేలా పలు సోషల్ మీడియాలు ట్రోలింగ్ చేస్తున్నాయని సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహామెహ్రా తెలిపారు. ఇప్పటికీ 8 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఈమధ్య ఎమ్మెల్సీ కవితపై ఎక్కువ ట్రోలింగ్ జరిగాయని.. ఆమెను కించపరిచేలా అభ్యుస్, వల్గర్‌గా ట్రోల్ చేశారని వివరించారు. ఎవరినైనా కించపరిచే విధంగా ట్రోల్స్, మీమ్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.

Next Story