TS : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవు : భట్టి విక్రమార్క

TS : పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవు : భట్టి విక్రమార్క

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేకుండా పోయాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.. మంచిర్యాల జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క.. బెల్లంపల్లిలో మీడియాతో మాట్లాడారు.. తెలంగాణ సంపదను ప్రైవేటు వారికి దోచి పెడుతున్నారని మండిపడ్డారు.. కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టును రద్దు చేసి కొత్త డిజైన్‌ పేరిట కాళేశ్వరానికి తరలించారని.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నీటి తిప్పలు తప్పడం లేదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుంటే ఓడిపోతామన్న భయం బీఆర్‌ఎస్‌ నేతల్లో పెరుగుతోందన్నారు. కేసీఆర్‌ పరిపాలనను గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు.

Next Story