TS : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు రెక్కలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సిటీలో ఇళ్ల విక్రయాలు 19శాతం పెరిగాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ అనలైజ్ సంస్థ నైట్‌ఫ్రాంక్ తెలిపింది.దేశ రియల్ రంగంలో లావాదేవిలు జనవరి-మార్చి మధ్య స్థిరంగా సాగాయని నైట్‌ఫ్రాంక్ తన నివేదిక లో తెలిపింది.దేశంలోని 8 మెట్రోపాలిటన్ సిటీస్‌లో గత 3 నెలల్లో రెసిడెన్సీయల్ ఫ్లాట్లు 1 శాతం పెరిగి, 79 వేల 126కు చేరాయి ఆఫీస్ లీజింగ్ లావాదేవీలు ఏడాది ప్రాతిపదికన 5శాతం వృద్ధి చెందినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఇళ్ల విక్రయాలు 19 శాతం పెరిగి, 8వేల 300 యూనిట్లకు చేరాయి. ఆఫీసు అద్దె 46 శాతం క్షీణించి, 8 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇళ్ల ధరలతో పాటు, అద్దెలూ 5శాతం చొప్పున పెరిగినట్లు నివేదిక తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇళ్ల ధరలు ఒకటి నుంచి ఏడు శాతం పెరిగాయి. ఆఫీస్ రెంట్ లు రెండు నుంచి తొమ్మిది శాతం పెరిగాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతూ దేశంలోనే అత్యధిక భూమ్ కలిగిన నగరంగా హైదరాబాద్ దూసుకుపోతుంది.మొదటి స్థానంలో ముంబై ఉంటే తరువాతి స్థానంలో మన హైదరాబాద్ ఉంది నిలబెట్టుకుంది. ఇతర టాప్ 7 నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీ రెసిడెన్షియల్ మార్కెట్ 171 శాతం పెరిగి సత్తా చాటింది. అన్ని రంగాలలో హైదరాబాద్ దూసుకుపోతోంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 5 శాతం పెరిగింది. మొత్తం 1.13 కోట్ల చదరపు అడుగుల స్థలం లీజింగ్‌కు వెళ్లింది.ఇక వడ్డీ రేట్లు పెరుగుతున్నా, రెసిడెన్సియల్ ఫ్లాట్‌ల మార్కెట్ నిలకడగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గత కొన్ని నెలలుగా ఇళ్ల కొనుగోలుదారుల సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని, అయినా ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదని నైట్ ఫ్రాంక్ అంటోంది. మిడిల్, ప్రీమియం ఇళ్ల కేటగిరిల్లో అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని, రానున్న కాలంలో కూడా ఈ ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేసింది.
ఇక రేట్ల విషయానికి వస్తే..బెంగళూరులో అత్యధికంగా 7 శాతం పెరిగాయి.ముంబయిలో 6,చెన్నైలో 5,పుణెలో 4, అహ్మదాబాద్‌లో, ఢిల్లీలో 3 కోల్‌కతాలో 1 శాతం పెరిగాయి. ఆఫీస్ రెంట్ లు కోల్‌కతాలో 9 శాతం, బెంగళూరు,చెన్నైలలో 5,పుణె,ముంబయిలో 4,అహ్మదాబాద్‌లో 3,ఢిల్లీలో 2 శాతం చొప్పున అద్దెలు పెరిగాయి.
ఇన్‌పుట్ ఖర్చులు,బలమైన డిమాండ్ పెరుగుదల మూలధన విలువలతో రెసిడెన్షియల్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇది హైదరాబాద్ మినహా అన్ని నగరాల్లో 3 శాతం నుండి 7 శాతం మాత్రమే పెరుగుదల ఉంటే హైదరాబాద్ లో మాత్రం రెండంకెల ధరల వృద్ధిని సాధించింది. ఐటీ రంగం.. స్టార్టప్‌లలో ఏర్పడిన ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్‌ను నడిపిస్తున్నాయి.మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం వల్ల నగరంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో కొత్త రెసిడెన్షియల్ క్లస్టర్‌లు పుట్టుకొచ్చి రియల్ భూమ్ విస్తరించి రెసిడెన్షియల్ అమ్మకాలు పెరగడానికి కారణమయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com