TS : బొమ్మలరామారం నుంచి బండి సంజయ్ తరలింపు

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు ఎక్కడికి తరలిస్తున్నారో ఇంకా క్లారిటీ రావడం లేదు. సంజయ్‌పై కుట్ర కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయనను వరంగల్‌లో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చుతారని వార్తలు వచ్చాయి. ఐతే.. జనగామ నుంచి పాలకుర్తికి సంజయ్‌ను తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక్కడి నుంచి సంజయ్‌ను ఎక్కడికి తరలిస్తారో క్లారిటీ రావడం లేదు.
అటు.. పెంబర్తి దగ్గర సంజయ్ ఉన్న వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డుపై టైర్లు కాలబెడుతూ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వాహనం పైకెక్కి ఆందోళనకు దిగారు. దీంతో.. పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్‌లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య బండి సంజయ్‌ను వరంగల్ తరలిస్తున్నారు.
భారీ బందోబస్తు మధ్య బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి సంజయ్‌ను తరలించిన పోలీసులు భువనగిరిలో న్యాయమూర్తి ముందు హాజరుపర్చాలని భావించారు. ఐతే.. న్యాయమూర్తి లీవ్‌లో ఉన్నందున వరంగల్ తరలించాలని నిర్ణయించారు. పెంబర్తి దగ్గర వరంగల్ పోలీసులకు అప్పగించారు. ఇక్కడి నుంచి మళ్లీ ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. జనగాం నుంచి పాలకుర్తి వైపు సంజయ్‌ను తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com