TS : పోలీసుల కస్టడీలోకి బండి సంజయ్.!?
By - Vijayanand |6 April 2023 9:34 AM GMT
బండి సంజయ్ ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు
టెన్త్ పేపర్ లీక్ కేసులో జైల్లో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్‌ను వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బండి సంజయ్ బెయిల్ వాదనలతో పాటు.. కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశం ఉంది. అటు పేపర్ లీక్ కేసులో మరికొంత మందికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కేసుల కీలక నిందితుడుగా ఉన్న ప్రశాంత్ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన పీఏతో మరికొంత మందికి టెన్త్ పేపర్ వాట్సప్‌లో అందినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా.. వారికీ నోటీసులిచ్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com