TS : బండి సంజయ్‌పై పువ్వాడ అజయ్‌ ఫైర్‌

TS : బండి సంజయ్‌పై పువ్వాడ అజయ్‌ ఫైర్‌
X

బండి సంజయ్‌పై మంత్రి పువ్వాడ అజయ్‌ ఫైర్‌ అయ్యారు 9ఏళ్ల కేసీఆర్‌ పాలనలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదన్నారు. కుట్రతోనే పేపర్‌ లీక్‌ చేసి అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్‌తో ఆడుకోవద్దన్నారు.పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తుంటే పేపర్లను లీక్‌ చేసి రాక్షసానందం పొందుతున్నారన్నారు.ఓ జాతీయ పార్టీ చెందిన రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఉందంటే ప్రజలు ఓ సారి ఆలోచించుకోవాలన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు పువ్వాడ.

Tags

Next Story