TS : నిరుద్యోగులకు అండగా 25న గజ్వేల్‌లో కాంగ్రెస్ భారీ సభ

TS : నిరుద్యోగులకు అండగా 25న గజ్వేల్‌లో కాంగ్రెస్ భారీ సభ
X

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు సరిగా లేవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహంచిన కాంగ్రెస్‌ విసృతస్థాయి సమావేశంలో ఎఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రేతో కలిసి పాల్గొన్న రేవంత్.. నాలుగు అంశాలపై ఎజెండా సిద్ధం చేశారు. ఏప్రిల్ 7న కాంగ్రెస్ ఆధ్వర్యంలో కుతుబ్షాయి గ్రౌండ్‌లో ఇఫ్తార్ విందు నిర్వహిచనున్నట్లు రేవంత్ తెలిపారు. ఇక 8వ తేదీన రాహుల్ గాంధీపై అనర్హత వేటకు నిరసనగా మంచిర్యాలలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. 10వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు.

జహిరాబాద్‌లో మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర ఉంటుందని రేవంత్ వెల్లడించారు. కాంగ్రెస్‌ ఫిర్యాదుతోనే టీఎస్‌పీఎస్‌ వ్యవహారంపై ఈడీ కేసు నమోదు చేసిందన్న రేవంత్... నిరుద్యోగులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. నిరుద్యోగులకు అండగా 25న గజ్వేల్‌లో భారీ సభకు ఏర్పాటు చేద్దామని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు.

మరోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతల జాబితా ఇవ్వాలన్న రేవంత్. ఏప్రిల్ 25 నుంచి మే 6వ తేదీ వరకు ప్రచారంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా పాగా వేసినట్లేనని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కర్ణాటకంటే మనకే ఎక్కువ ఇంపార్టెంట్ అని సమావేశంలో రేవంత్ అన్నారు.

Next Story