TS : 30 వేల కోట్ల రూపాయలను కేంద్రం నిలిపేసింది : హరీష్ రావు

TS : 30 వేల కోట్ల రూపాయలను కేంద్రం నిలిపేసింది : హరీష్ రావు
సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్‌లో మోదీ సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్‌రావు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాగు నీటి మోటర్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకి రావాల్సిన 30 వేల కోట్ల రూపాయలను కేంద్రం నిలిపేసిందని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్‌లో మోదీ సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఏపీ మోటర్లకు మీటర్లు పెట్టి డబ్బులు తెచ్చుకుందన్నారు. వెనుకబడిన జిల్లాల నిధి కింద రావాల్సిన వెయ్యి 350 కోట్ల రూపాయలను కూడా కేంద్రం ఆపిందని హరీష్‌రావు విమర్శించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రావాల్సిన 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదన్నారు. 13 వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయానికి కరెంట్ సరిపోవడం లేదని.. అదనంగా యూనిట్‌కు 20 రూపాయలు చొప్పున తాము కొంటున్నామని అన్నారు. విద్యుత్ కోసం నెలకు 1500 కోట్లు ఖర్చు పెడుతున్నామని మంత్రి హరీష్‌రావు స్పష్టంచేశారు.

Tags

Next Story