TS : గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ ధర్నా

గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. రోడ్డుపైనే వంట చేస్తూ మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ ధరలు పెంచి పేదవాడిపై భారం మోపారని విమర్శించారు.
కరీంనగర్ లో గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'బీజేపీకొ హటావో దేశ్‌కొ బచావో' అంటూ నినాదాలు చేశారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్‌బీ నగర్ రింగ్ రోడ్డు లో వినూత్న నిరసన చేపట్టారు. గ్యాస్ ధరల పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
డొమెస్టిక్ సిలిండర్‌పై 50 రూపాయలు, కమర్షియల్ సిలిండర్‌పై 350 రూపాయలు పెరిగింది. దాదాపు 8 నెలల గ్యాప్ తర్వాత మళ్లీ డొమెస్టిక్ సిలిండర్ ధర పెంచారు. చివరగా 2022 జులైలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ ధర 1155 రూపాయలకు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com