TS : ఆరోగ్య మహిళా పథకాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

X
By - Vijayanand |8 March 2023 1:26 PM IST
ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని,మహిళల సంక్షేమ కోసం ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు..ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని,మహిళల సంక్షేమ కోసం ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీర్చామన్నారు మంత్రి హరీశ్‌రావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com