TS : బీజేపీ వాళ్లు సత్యహరిశ్చంద్రుని తమ్ముళ్లా : కేటీఆర్

బీజేపీ వాళ్లు సత్య హరిశ్చంద్రుని తమ్ముళ్లా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీ నాయకులపై, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బీజేపీలో ప్రతీ ఒక్కరు రాజా హరిశ్చంద్రుని సోదరులా అని ప్రశ్నించారు. మోదీ చెబుతున్న డబల్ ఇంజన్ సర్కార్ లో ఓ ఇంజన్ అదానీ అని మరో ఇంజన్ మోదీ అని అన్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన అదానీ షేర్ల వ్యవహారంపై మోదీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీకి బినామీగా గౌతమ్ అదానీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లై డిటెక్టర్ తో అదానీనీ ప్రశ్నించాలని అన్నారు కేటీఆర్.
ప్రజలముందుకు వచ్చి అదానీకి జవాబు చెప్పే దమ్ముందా అని ప్రశ్నిస్తూనే మరో సారి బీజేపీ వాళ్లు హరిశ్చంద్రుని తమ్ముల్లా అని అడిగారు మంత్రి కేటీఆర్. బీజేపీలో అందరూ క్లీన్ గా ఏ కేసు లేకుండా ఉన్నారా అని ప్రశ్నించారు. మోదీ అగ్నితో ఆటలాడుతున్నారని, తొందరలోనే మోదీ రియలైజ్ అయ్యే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆయన అన్నారు.
తాజాగా కేటీఆర్ చెల్లెలు కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా విచారించడానికి ఈడీ నోటీసులు ఇవ్వగా ఆవిడ ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. కవితను రెండు రోజుల్లో ఈడీ ప్రశ్నించనుండగా... కేటీఆర్ మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లందరూ సత్యహరిశ్చంద్రుని తమ్ముళ్లా అని అడగడం చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com