TS : లబోదిబో మంటున్న రాజయ్య... కేకు కట్ చేయకుండా ఏడ్చేశారు

TS : లబోదిబో మంటున్న రాజయ్య... కేకు కట్ చేయకుండా ఏడ్చేశారు
X
తనను రాజకీయంగా ఎదుర్కోలేని ప్రత్యర్థులు నీచానికి దిగజారుతున్నారని అన్నారు

లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే వెక్కివెక్కి ఏడ్చారు. తనపై కావాలనే లైంగిక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తన ప్రత్యర్థులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. కరుణాపురంలో బుధవారం ఓ చర్చి ఫాదర్ జన్మదిన వేడుకలకు రాజయ్య హజరయ్యారు. కేకు కట్ చేసేటప్పుడు తీవ్ర బావోద్వేగానికి లోనయ్యారు. కేకు ముందు కూర్చుని వెక్కివెక్కి ఏడ్చారు.


రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో తనను రాజకీయంగా ఎదుర్కోలేని ప్రత్యర్థులు నీచానికి దిగజారుతున్నారని అన్నారు రాజయ్య. కూతురు వయస్సున్న మహిళను అడ్డుపెట్టుకుని తనపై లైంగిక ఆరోపణలు చేయించారని చెప్పారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తనపై పోటీ చేసే ఒక్కొక్కరి డిపాజిట్ గల్లంతవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తనపై జరిగిన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వారికి బుద్దిచెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.


Tags

Next Story