TS : పదో తరగతి హిందీ పేపర్‌ లీకేజీ కేసులో ముగ్గురు అరెస్టు

TS : పదో తరగతి హిందీ పేపర్‌ లీకేజీ కేసులో ముగ్గురు అరెస్టు
X

పదో తరగతి హిందీ పేపర్‌ లీకేజీ కేసులో వరంగల్ జిల్లా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసారు. శివగణేష్, ప్రశాంత్‌తోపాటు మైనర్ బాలుడ్ని అరెస్ట్ చేసారు. మరో నిందితుడు మహేష్‌ పరారీలో ఉన్నాడు. కమలాపూర్ బాలుర ప్రబుత్వ పాఠశాల సెంటర్ వద్ద మైనల్ బాలుడు చెట్టు ఎక్కి హిందీ పేపర్‌ను ఫొటో తీసాడని వరంగల్ సీపీ తెలిపారు. మైనర్ బాలుడు ఫొటో తీసి శివగణేష్‌కు పంపాడని.. అతను మహేష్‌కు షేర్ చేశాడన్నారు. తర్వాత ఎస్‌ఎస్‌సీ 2019-20 గ్రూప్‌లో పోస్ట్ చేసి వైరల్ చేశారని చెప్పారు. హిందీ పేపర్ లీకైందని జర్నలిస్ట్ ప్రశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని వివరించారు. వరుసగా రెండోరోజు ప్ర శ్నాపత్రం లీకైందని విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ చేసిన పలువురికి నోటీసులు ఇచ్చి విచారిస్తామని వరంగల్ సీపీ స్పష్టంచేశారు.

కమలాపూర్‌లో పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. చీఫ్ సూపరింటెండెంట్‌ శివ ప్రసాద్, డిపార్ట్‌మెంటల్‌ అధికారి శ్రీధర్‌ను సస్పెండ్‌ చేసింది. పరీక్ష ఇన్విజిలేటర్‌ సబియా మదహత్‌ను సర్వీసు నుంచి తొలగించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఐదేళ్ల పాటు పరీక్ష రాయకుండా విద్యార్థిని డిబార్‌ చేసింది.

Next Story