TS : గురుకులాల్లో పదో తరగతి ఫలితాలు దిగజారిపోయాయి : భట్టి

TS : గురుకులాల్లో పదో తరగతి ఫలితాలు దిగజారిపోయాయి : భట్టి

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టి.. ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించినట్లుగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురుకులాల్లో పదో తరగతి ఫలితాలు దిగజారిపోతుండటం చూస్తే అనుమానం కలుగుతోందన్నారు. ఇక.. పాలమూరు - రంగారెడ్డి పథకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను మార్చి పాలమూరు రంగారెడ్డి పేరుతో జిల్లా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మౌనం వహిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని.. ఇవే ఫలితాలు రేపు తెలంగాణలో కూడా రిపీట్ కానున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story