అసెంబ్లీలో కొత్తగా 40 సీట్లు కేటాయించాం: వేముల ప్రశాంత్ రెడ్డి

సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నతెలంగాణ శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ శాఖలు సమర్పించిన ఇన్‌పుట్స్, కరోనా మార్గదర్శకాలు పాటించడంపై చర్చించారు. మీడియా ప్రతినిధులు, మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి అనుమతి ఇవ్వడంపైనా చర్చ జరిగింది.
పార్లమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ, మండలిలో 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కేటాయించామని తెలిపారు. అసెంబ్లీకి వచ్చే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు కరోనా టెస్టులు చేస్తామని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల ముందే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com