సోలిపేట రామలింగారెడ్డి మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని ఊహించలేదన్నారు సీఎం కేసీఆర్. నిత్యం ప్రజల మధ్య మనుగడ సాగించిన నిరాబండర నేతగా రామలింగారెడ్డిని కీర్తించారు.. చిన్న వయసులో అనారోగ్యంతో హఠాన్మరణం చెందడం విషాదకరమన్నారు. యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను కలచివేస్తోందన్నారు సీఎం కేసీఆర్.
ఎంతో చురుగ్గా, అందరినీ ఉత్తేజపరుస్తూ కనిపించిన రామలింగారెడ్డి ఇప్పుడు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తు చేశారు.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు.. గత సమావేశాల వరకు సభ్యులందరితో కలిసి మెలిసి కనిపించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఇప్పుడు లేకపోవడం విచారకరమన్నారు. రామలింగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు భట్టి విక్రమార్క.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com