Bandi sanjay : సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ

Bandi sanjay : సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ బహిరంగ లేఖ
X
Bandi sanjay : పాలమూరుకు రండి... సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దామని సీఎం కేసీఆర్‌కు ప్రజాసంగ్రామ యాత్ర నుండి బీజేపీ రాష్ట్రఅధ్యక్షులు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు.

Bandi sanjay : పాలమూరుకు రండి... సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దామని సీఎం కేసీఆర్‌కు ప్రజాసంగ్రామ యాత్ర నుండి బీజేపీ రాష్ట్రఅధ్యక్షులు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని లేఖలో డిమాండ్‌ చేశారు. పాలమూరును వలసలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్‌ చేసిన వాగ్ధానాలేమీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గత 8ఏండ్లలో పాలమూరులోని ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తికాలేదని విమర్శించారు. గత ప్రభుత్వాలు పూర్తిచేసిన సాగునీటి ప్రాజెక్టులను తమ క్రెడిట్‌గా చెప్పుకుంటూ పాలమూరు సస్యశామలమైందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని బండి సంజయ్‌ మండి పడ్డారు.

Tags

Next Story