TS : తెలంగాణకు BMS కంపెనీ.. మూడేళ్లలో 1500 ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వంతో BMS కంపెనీ అవగాహన ఒప్పందం జరిగింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాయి. డ్రగ్ డెవలప్‌మెంట్, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మూడేళ్లలో సుమారు 1500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది BMS కంపెనీ.
హైదరాబాద్ ఫార్మాసిటీలో ఉన్న అవకాశాల గురించి..BMS కంపెనీ ప్రతినిధులకు వివరించారు మంత్రి కేటీఆర్. ఫార్మాసిటీకి అవసరమైన పర్యావరణ, అనుమతులు ఉన్న నేపథ్యంలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుకు ఉన్న సౌలభ్యాన్ని వివరించారు. ప్రపంచంలోనే టాప్-10 పార్మాసూటికల్ కంపెనీలో BMS ఒకటనిబయోటెక్నాలజీ లైఫ్ సెన్సెస్ రంగంలో హైదరాబాద్ బలంగా ఎదుగుతూ ఉందని,లైఫ్ సెన్సెస్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న..యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశమన్నారు మంత్రి కేటీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com