Engineering Counselling 2024: జూన్‌ 27 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌

Engineering Counselling 2024: జూన్‌ 27 నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌
X
బీటెక్‌ సీట్ల భర్తీకి మూడు విడతల ప్రవేశాలు

ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యాశాఖ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. ప్రవేశాల కమిటీతో సమావేశం నిర్వహించిన విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఇంజినీరింగ్‌, పాలిసెట్, ఈ-సెట్ కౌన్సిలింగ్‌ల తేదీలతో కూడిన షెడ్యూల్‌ని విడుదల చేశారు. ఇక ఇంటర్నల్ స్లైడింగ్‌ని సైతం ఈ సారి కన్వీనర్ కోటా ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ మూడు విడతల్లో జరగనుంది. జూన్ 27 నుంచి ఆగస్టు 17 వరకు మొత్తం కౌన్సిలింగ్, సీట్ల ఖరారు ప్రక్రియ కొనసాగుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయా సెట్‌లకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్‌ని విడుదల చేశారు. ఇంజినీరింగ్‌కు సంబంధించి మొత్తం 3 ఫేజ్‌లలో కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. జూన్ 27 నుంచి తొలి విడత కౌన్సింగ్ ప్రారంభించి.... జూన్ 30 నుంచి జులై 8వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. జులై 12న తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసి... జులై 19 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ చేపట్టనున్నట్టు విద్యా శాఖ షెడ్యూల్ లో పేర్కొంది. జులై 20, 21 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి... జులై 24 లోపు సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది. ఇక జులై 30 నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభించి... జులై 31 నుంచి వెబ్ ఆప్షన్లకు అకాశం ఇచ్చింది. ఆగస్టు 5న మూడో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నట్టు పేర్కొంది. ఇదే షెడ్యూల్‌ ప్రకారం MPC విభాగం విద్యార్థులకు బీఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది.

ఇక విద్యార్థులు తమకు అడ్మిషన్ దొరికిన కళాశాలలోనే కోర్సులు మార్చుకునేందుకు అవకాశం కల్పించే ఇంటర్నల్ స్లైడింగ్‌ని సైతం ఈ ఏడాది నుంచి కన్వీనర్ ద్వారా చేపట్టనున్నట్టు విద్యాశాఖ స్ఫష్టం చేసింది. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌కి అవకాశం ఇచ్చి... 16 ఆగస్టు లోపు సీట్ల కేటాయింపు పూర్తి చేయనుంది. ఇక ఆగస్టు 17న స్మాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్న్టు తెలిపింది. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత తప్పని సరిగా విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొంది. ఒరిజినల్ టీసీతో పాటు... ఒక సెట్ జిరాక్స్ కాపీ సర్టిఫికేట్లను కళాశాలలో సమర్పించాలని తెలిపింది. రెండో ఫేజ్ లో సీటు పొంది కళాశాలలో రిపోర్ట్ చేయని వారిని మూడో దశ కౌన్సిలింగ్‌కి అనర్హులుగా ఉన్నత విద్యా మండలి పేర్కొంది. బీటెక్‌ సీట్ల భర్తీకి మూడు విడతల ప్రవేశాలు


Tags

Next Story