55శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరు: మంత్రి సబితా

55శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరు: మంత్రి సబితా
రాష్ట్రవ్యాప్తంగా 55శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

రాష్ట్రవ్యాప్తంగా 55శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి, జిల్లెల గూడ ప్రభుత్వ పాఠశాలలను సబితా ఇంద్రారెడ్డి తనిఖీ చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విద్యార్థుల హాజరు శాతం పెరిగిందన్నారు. రెండు, మూడు రోజుల్లో 100శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ.. భౌతికదూరం పాటించాలన్నారు. మధ్యాహ్న భోజనం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు మంత్రి సబితా. మిగతా తరగతులు ప్రారంభించాలని తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తి వస్తుందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Tags

Next Story