TS : నకిలీ డెత్ సర్టిఫికెట్లపై GHMC సీరియస్

TS : నకిలీ డెత్ సర్టిఫికెట్లపై GHMC సీరియస్
సంబంధిత విభాగ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సీఎంవోహెచ్‌, స్టాప్టికల్‌ విభాగం, ఏఎంవోహెచ్‌లు, ఏఎంసీలపై మేయర్‌, కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

నకిలీ బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని జీహెచ్‌ఎంసీ సీరియస్‌గా తీసుకుంది. సంబంధిత విభాగ అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. సీఎంవోహెచ్‌, స్టాప్టికల్‌ విభాగం, ఏఎంవోహెచ్‌లు, ఏఎంసీలపై మేయర్‌, కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై మేయర్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. విజిలెన్స్‌ అధికారులు ఇప్పటికే మేయర్‌కు ప్రాథమిక నివేదిక అందజేశారు. ఈ నివేదికలో ఇంటి దొంగలను పొందుపర్చినట్లు తెలుస్తోంది. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేసే యోచనలో ఉన్నారు. వీధి కుక్కల బెడద, నకిలీ బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల వ్యవహారంతో జీహెచ్‌ఎంసీకి అవినీతి మరకలు అంటుకున్నాయి. డ్యామేజీని కంట్రోల్‌ చేసే పనిలో మేయర్‌, కమిషనర్‌ నిమగ్నమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story