కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

X
తెలంగాణలో సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్‌పై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తుల మేరకు పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శిని ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
