నవంబర్ 1న టీజీసెట్..

నవంబర్ 1న టీజీసెట్..
X
గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం నిర్వహించే టీజీసెట్ పరీక్ష తేదీని కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం నిర్వహించే టీజీసెట్ పరీక్ష తేదీని కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కరోనా నిబంధనలతో ఈ ప్రవేశ పరీక్షను నవంబర్ 1న నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 31 వరకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇక గురుకులాల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 48,240 సీట్ల కోసం 1,48,168 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

Tags

Next Story