TS High Court: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై హైకోర్ట్..

TS High Court: అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై హైకోర్ట్..

TS High Court: ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలంటేనే ప్రాణం పోయినంత పనవుతుంది. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా బిల్లు కట్టేందుకు పైసలు సరిపోవు. ఇక కరోనా వచ్చిన పేషెంట్ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.

వారం రోజులకి తక్కువ కాకుండా వార్డుల్లో ఉంచి లక్షల్లో బిల్లు చేతిలో పెడుతున్నారు. పేషెంట్ బతికాడు అంతే చాలనుకుని కట్టే వాళ్లూ కొందరు ఉన్నారు. కానీ అందరి పరిస్థితి అది కాదు.

కొన్ని ఫిర్యాదుల మేరకు హైకోర్టు ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడా ఝుళిపించింది. హైకోర్టు ధిక్కరణలను ఉల్లంఘించిన ఆస్పత్రుల మెడపై కత్తి పెట్టి వసూలు చేసిన సొమ్మును వాపసు ఇప్పించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

ఊరికే వేటు వేస్తే సొమ్ము ఎందుకిస్తారు.. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. కేరళలో వసూలు చేసిన సొమ్ముపై రెట్టింపు జరిమానా విధిస్తున్నారు. అలాంటి అంశాలను పరిశీలించాలి అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా వాటిని నియంత్రిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయకపోవడంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. 48 గంటల్లో జీవో ఇవ్వాలంటూ మే 17న ఉత్తర్వులిస్తే ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది.

ఇక ఔషధ ధరలపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అంశంపై ఎందుకు చొరవ చూపించట్లేదని ప్రభుత్వాన్ని నిలదీసింది.

Tags

Read MoreRead Less
Next Story