TS InterBoard: ఈ సారి కూడా నో ఆన్‌లైన్ వాల్యూయేషన్

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆన్‌లైన్ వాల్యుయేషన్ ఈ ఏడాది అమల్లోకి వస్తుందా? ఈ టెండర్లకు స్పందన లేదా? అంటే అవునంటున్నాయి ప్రభుత్వవర్గాలు. దీంతో.. ఈ ఏడాది ఆన్‌లైన్ వాల్యుయేషన్ అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లకు ఆశించిన మేర స్పందన రాకపోవడం, మరోవైపు వార్షిక పరీక్షలు దగ్గర పడడంతో ఈ సారి ఇది అమలుకు అవకాశం లేదంటున్నారు. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల వాల్యుయేషన్‌ను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 30లక్షల జవాబు పత్రాలకు ఈ ఆన్‌లైన్ వాల్యుయేషన్ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. తొలిసారి టెండర్లలో ఒకే సంస్థ పాల్గొనడంతో.. దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు రెండో సారి టెండర్లలతో స్పందన కరువైంది. కేవలం రెండు సంస్థలు మాత్రమే పాల్గొన్న టెండర్ గడువు ముగిసింది. దీంతో వీటిని ఖరారు చేయాలా? లేక రద్దు చేయాలా అని సందిగ్ధంలో ఉన్నారు అధికారులు. ప్రస్తుతానికి టెండర్లకు సంబంధించిన సాంకేతిక పత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ నెల 15 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. వచ్చే నెల 4న ఇవి పూర్తవుతాయి. ఆ వెంటనే వాల్యుయేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ప్రక్రియ ఏ మాత్రం ఆలస్యమైనా, రిజల్ట్ ప్రకటన లేటవుతుంది. అదే జరిగితే.. ఐఐటీ, ఇంజనీరింగ్, వంటి కోర్సుల్లో చేరే నవిద్యార్థుల షెడ్యూల్ దెబ్బతింటుంది. దీంతో అధికారులు.. ఈ టెండర్‌ను ద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

