TS Inter Exams: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు..
TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టినా థర్డ్ వేవ్ భయపెడుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం భావ్యం కాదని భావించింది తెలంగాణ గవర్నమెంట్. కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగులో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో పరీక్షల నిర్వహణ సాద్యం కాదని మంత్రివర్గం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను కూడా రద్ధు చేసింది. దీనిపై సాయింత్రం అధికారిక ప్రకటన వెలువడనుంది. పరీక్షల రద్దు, ఫలితాల విధానంపై ఇంటర్ బోర్డు ప్రకటన చేయనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com