TS, SSC : నిన్న తెలుగు పేపర్, ఈరోజు హిందీ పేపర్ లీక్

తెలంగాణలో ప్రశ్నా పత్రాలు లీక్ అవడం ఆగడం లేదు. నిన్న పదవతరగతి తెలుగు పేపర్ లీక్ అవగా, ఈ రోజు హిందీ పేపర్ లీక్ అయింది. TSPSC ప్రశ్నా పత్రంతో మొదలైన లీకుల పర్వం పదవతరగతి విద్యార్థులను కూడా వదలలేదు. నిన్న తాండూరులో తెలుగు పేపర్, ఇవాళ వరంగల్‌లో హిందీ పేపర్ లీక్ కావడంతో.. స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వరంగల్‌లో హిందీ పేపర్ లీక్ ఘటనపై DSE నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వరంగల్ DEO, MEOపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన సీరియస్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్‌లు బయటకు వస్తున్నాయని అనుమానిస్తున్నారు. హిందీ పేపర్ లీక్‌పై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా అధికారుల ప్రాథమిక సమాచారం ఆధారంగా..చర్యలకు సిద్ధమవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com