TS Lockdown: ఊపిరి పీల్చుకోనున్న రాష్ట్ర ప్రజలు.. సాయింత్రం 5 గంటల వరకు..

TS Lockdown: లాక్డౌన్ అమలు చేయకపోతే కరోనాని కట్టడి చేయడం కష్టమని భావించాయి రాష్ట్రాలు. ఆ దిశగా వివిధ రాష్ట్రాలు కేసులు నమోదవుతున్న సంఖ్యను బట్టి నెమ్మదిగా లాక్డౌన్ సడలింపులను అమలు పరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొదటి విడతలో ఉదయం 6 నుంచి 10వరకు, రెండవ విడతలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది.
ఈ తరహా లాక్డౌన్ గడువు ఈనెల 9తో ముగియనున్నందున తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశం అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సాయింత్రం 5 గంటల వరకు లాక్డౌన్ విధించి ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా మరో గంట అనుమతించాలనుకుంటోంది. ఇక కర్ఫ్యూ పకడ్భందీగా అమలు చేయాలనుకుంటోంది.
కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆంక్షల అమలుతో పాటు హై రిస్క్ ఉన్న వారికి టీకాల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com