TS: నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS: నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
X
కాళేశ్వరం కమిషన్ నివేదికే ఎజెండా.. సభ ముందుకు రానున్న జస్టిస్ ఘోష్ నివేదిక... ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక

నేటి నుం­చి తె­లం­గాణ శా­స­న­సభ సమా­వే­శా­లు ప్రా­రం­భం కా­ను­న్నా­యి. శా­స­న­స­భ­తో­పా­టు శా­స­న­మం­డ­లి సమా­వే­శా­లు ఉదయం 10.30 గం­ట­ల­కు ప్రా­రం­భ­మ­వు­తా­యి. ఇవా­ళే తె­లం­గాణ మం­త్రి­వ­ర్గ సమా­వే­శం కూడా జరు­గు­తుం­ది. సీఎం రే­వం­త్‌­రె­డ్డి అధ్య­క్ష­తన మధ్యా­హ్నం ఒంటి గం­ట­కు శా­స­న­స­భ­లో­ని కమి­టీ హా­ల్‌­లో క్యా­బి­నె­ట్‌ భేటీ ప్రా­రం­భ­మ­వు­తుం­ది. మం­త్రి­వ­ర్గ సమా­వే­శం­లో ప్ర­ధా­నం­గా స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­ల­కు 42 శాతం సీ­ట్ల కే­టా­యిం­పు, స్థా­నిక సం­స్థల ఎన్ని­కల ని­ర్వ­హ­ణ­పై చర్చిం­చ­ను­న్నా­రు. కాగా, అసెం­బ్లీ సమా­వే­శా­ల్లో.. కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­పై జస్టి­స్‌ పీసీ ఘో­ష్‌ కమి­ష­న్‌ ఇచ్చిన ని­వే­ది­క­ను ప్ర­వే­శ­పె­ట్టి చర్చిం­చ­ను­న్నా­రు. ఈ శా­స­న­సభ సమా­వే­శా­ల్లో వి­విధ పా­ర్టీల నుం­చి వచ్చే అభి­ప్రా­యా­ల­ను పరి­శీ­లిం­చి తదు­ప­రి అడు­గు వే­యా­ల­న్న ఆలో­చ­న­లో ప్ర­భు­త్వం ఉంది. ఈ సమా­వే­శా­ల్లో­నే డి­ప్యూ­టీ స్పీ­క­ర్‌ ఎన్నిక కూడా జర­గ­నుం­ది. 2023 డి­సెం­బ­రు­లో కాం­గ్రె­స్‌ అధి­కా­రం­లో­కి వచ్చిన నాటి నుం­చి డి­ప్యూ­టీ స్పీ­క­ర్‌ ఎన్నిక జర­గ­లే­దు. స్పీ­క­ర్‌ లేని సమ­యం­లో ప్యా­నె­ల్‌ స్పీ­క­ర్ల ఆధ్వ­ర్యం­లో­నే శా­స­న­సభ నడు­స్తోం­ది. అయి­తే ఇటీ­వల డో­ర్న­క­ల్‌ ఎమ్మె­ల్యే రాం­చం­ద­ర్‌ నా­య­క్‌­ను డి­ప్యూ­టీ స్పీ­క­ర్‌ పద­వి­కి ఎం­పిక చే­స్తూ ప్ర­భు­త్వం ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఇవాళ ప్రా­రం­భ­మ­య్యే అసెం­బ్లీ సమా­వే­శా­ల్లో డి­ప్యూ­టీ స్పీ­క­ర్‌­ను ఎన్ను­కు­నే అవ­కా­శా­లు­న్నా­యి.

వాడివేడిగా చర్చలు

ఇటీ­వల ఆక­స్మి­కం­గా మర­ణిం­చిన జూ­బ్లీ­హి­ల్స్‌ మాజీ ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్‌­కు.. సమా­వే­శాల తొలి రోజే అసెం­బ్లీ­లో సం­తా­పం ప్ర­క­టిం­చ­ను­న్నా­రు. సభ­లో­ని ఎమ్మె­ల్యే­లం­ద­రి­కీ జస్టి­స్ పీసీ ఘోష్ కమి­ష­న్ రి­పో­ర్ట్‌­ను ప్ర­భు­త్వం అం­దిం­చ­ను­న్న­ట్లు తె­లు­స్తోం­ది. జస్టి­స్ పీసీ ఘోష్ ఇచ్చిన రి­పో­ర్టు 600 పే­జీ­ల­కు పైగా ఉంది. ఈ ఈ రి­పో­ర్టు­ను సభ్యు­లం­ద­రి­కీ అం­ద­జే­సి.. పూ­ర్తి స్థా­యి­లో చర్చిం­చా­ల­ని రే­వం­త్ రె­డ్డి ప్ర­భు­త్వం లక్ష్యం­గా పె­ట్టు­కుం­ది. చర్చల తర్వాత.. కా­ళే­శ్వ­రం కమి­ష­న్ రి­పో­ర్టు­కు సం­బం­ధిం­చి తుది ని­ర్ణ­యా­లు తీ­సు­కో­ను­న్నా­రు. ఈ సమా­వే­శా­లు వాడీ వే­డి­గా జర­గ­ను­న్నా­యి. ము­ఖ్యం­గా కా­ళే­శ్వ­రం ని­వే­దిక పై కాం­గ్రె­స్, బీ­ఆ­ర్ఎ­స్ మధ్య వా­డీ­వే­డి­గా చర్చ జరి­గే అవ­కా­శం ఉంది. రా­ష్ర్టం­లో వి­వా­ద­స్ప­దం­గా మా­రిన మా­ర్వా­డీ గో­బ్యా­క్ అం­శా­న్ని బీ­జే­పీ శా­స­న­స­భ­లో లే­వ­నె­త్తే అవ­కా­శం ఉంది. ము­ఖ్యం­గా కాం­గ్రె­స్ పా­ర్టీ తాను ఎన్ని­కల సమ­యం­లో ఇచ్చిన హా­మీ­ల­ను పూ­ర్తి స్థా­యి­లో అమలు చే­య­క­పో­వ­డం­తో ప్ర­జల దృ­ష్టి­ని మర­ల్చం­దు­కే ఈ ని­నా­దా­న్ని కా­వా­ల­నే ఆ పా­ర్టీ క్రి­యే­ట్ చే­సిం­ద­ని బీ­జే­పీ నే­త­లు ఆరో­పి­స్తు­న్నా­రు.

Tags

Next Story